Pages

Tuesday, July 27, 2010

TOLET.........For Bachelors ?

బ్యాచలర్  కష్టాలు  ఇంతా అంతా కాదు. ఈ రోజుల్లొ బ్యాచలర్స్ కి ఇల్లు అద్దెకి ఇచ్చేవాడే  కరువయ్యాడు . పోని ఇచ్చిన అద్దె ఫామిలి ఇచ్చే దాని కన్నా ఎక్కువ.

అంతెందుకు నా కధే వినంఢి.....

సంవత్సరం నుంఢి ఒక రూములో వుంటున్నాను. గాలి ఆఢదు సరిగ్గా, వెలుతురు కూఢా రాదు. సరే ఎదో సరిపెట్టుకుంటున్నా. రెంఢే రెంఢు గదులు. ఎంఢా కాలం  మంచి నీళ్ళ ఇబ్బంది.అన్ని నెట్టుకున్టూ వచ్చనూ. కాని ఇప్పుడు ఒక్కసారిగా ఇంటి ఓనరు వచ్చి అద్దె పెంచాలి అన్నాడు.  ఒక్కసారిగా వెయ్య రూపాయలు పెంచాలి అన్నాడు. ఇంక అంతే నా వల్ల కాదనుకున్న. ఖాళీ చేస్తా అని చెప్పా.ఇంక క్రొత్త రూం కోసం వేట మొదలు పెట్ట.

తిరిగా తిరిగా తిరిగా...... తిరగని చోటు లేదు.
ఇల్లు అద్దె కి ఇవ్వాలంటే ఫ్యామిలి ...
సినిమా హాలులో టిక్కెట్లు మధ్య వరస లో  రావాలన్న ఫ్యామిలి ...
ఫామిలీలకి   అన్నీ చోట్ల  స్పెషల్ ఎంట్రి లు...

ఎవరిని అడిగిన మేము ఫ్యామిలికే ఇస్తాము అన్నారు. TOLET (For Families Only) అని బోర్డులు.
అప్పుడు అనిపించింది ఈ సిటి లో ఉండటానికి రూము కావాలన్న పెళ్ల్హి చేసుకోవాలి అని.

దీని బట్టి చూస్తే హలో బ్యాచెలర్స్ మనం పెళ్లి చేసుకుంటేనే నయమేమో ఆలోచించండి ........!!!
 
అదిగో మా ఓనరు ఒక్క క్షణం...


ఓనరు: ఓ బాబు ఎప్పుడు ?
నేను: ఈ నెల చివరికి ఖాళీ చేస్తానండి
ఓనరు: 1st కల్లా ఖాళీ చేయాలి... సరేనా !!!

 నేను: వెతుకు తున్నా నండి 99 % ఖాళీ చేస్తా.
ఓనరు: సరే కాని ఖాళీ చేసేటప్పుడు 2000 అదనంగా ఇచ్చి వెళ్ళు

నేను: అదేంటి సార్ అడ్వాన్సు వుందిగా మీ దగ్గర...మళ్ళీ
ఓనరు:ఈ నెల నుంచి పెంచుదామని డిసైడ్ అయ్యా ...!!!
నేను: సరే ఆలోచించుకోనివ్వండి
నాలో నేను: ఈ ఓనరు పాత్ర లోకి వచేసరికి మనిషి ఎందుకు ఇంత మారిపోతాడు. నిన్నటిదాకా ఈన మీద మంచి అభిప్రాయం వుంది, అది పోగొట్టుకున్నాడు.

ఇంటి యజమానులందరికి ఇదే నా విజ్ఞప్తి దయచేసి అద్దెకున్న వాళ్ళతో ఆడుకోవద్దు..!!! అలాగే అద్దెకున్న వాళ్ళు మీరు కూడా
వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకండి ....


మర్చేపోయాను  నాకు రూము దొరికిన్దండోయ్..... హమ్మయ్య ఒక పని అయిపోయింది !!!
 మరి వుంటానండి ...సర్దుకోవాలి కదా మరీ. సెలవు!!!   :-)

5 comments:

  1. కేకో కేక నువ్వు ఎంచక్క తెలుగులో బ్లాగులు రాయి ..చాల బాగుంది...!

    ReplyDelete
  2. గృహప్రవేశం ఎప్పుడు?

    ReplyDelete
  3. Papam ram ennokastalu vachayi neku...anduke twarga marriage chesuko ram...u will get all..enjoy

    ReplyDelete
  4. ఏంటి రామ్ రెండో బాణాన్ని ఏకంగా ఇంటి యజమానుల గుండెల్లో గుచ్చావ్...
    నీ శైలి బావుంది...:-)

    ReplyDelete
  5. మరి ఎందుకు ఆలస్యం తొందరగ పెళ్ళి చెసుకొ రాము .. మంచి ఇంట్లొ కి మారి పోవచ్చు .. లెదంటె పెళ్ళి తొ పాటు ఇల్లు కూడ కొంటే .. అన్ని కష్టాలు తీరిపోతాయి

    ReplyDelete