Pages

Monday, September 20, 2010

మెదడుకు మేత ఉండాల్సిందే!


navya.ఒక్కోసారి మనం తాళం చెవి కోసం ఇల్లంతా వెతికేస్తుంటాం, అంతెందుకు నేను ఒక్కోసారి తాళం లోపల పెట్టి బయట కప్పు వేసేసిన రోజులు వున్నాయి. మరోసారి ఏదో కొనాలని సూపర్ మార్కెట్ వరకు వెళతాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఏం కొనాలనుకున్నామో ఎంతకీ గుర్తుకురాదు. ఇంకోసారి కారును ఒకచోట పార్క్ చేసి మరోచోట వెతుకుతుంటాం. తీరా అది ఇంకోచోట కనిపించగానే 'ఛ.. రోజురోజుకీ మట్టిబుర్ర అయిపోతోంది..' అని మనల్ని మనమే తిట్టుకుంటాం.

ఒక్కోసారి క్షణం ముందు మనతో కరచాలనం చేసిన మనిషి పేరు కూడా మనం మరుక్షణమే మరిచిపోతుంటాం. తర్వాత 'ఏదో పేరు చెప్పాడబ్బా.. గుర్తుకురావడం లేదు' అని బుర్రబద్దలయ్యేలా ఆలోచిస్తాం. ఇలాంటి పరిస్థితులు రెండు మూడు ఎదురవగానే మనకేదో అయిపోయిందని, ఎన్నడూ లేనిది ఇంతగా మతిమరుపు వచ్చేసిందని ఆందోళన చెందుతుంటాం. కానీ ఇదంతా సహజమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

మన మెదడు ఇరవై ఏళ్ళ వయస్సులో, ముప్ఫై ఏళ్ళ వయస్సులో పని చేసినంత చురుకుగా వయసు పెరిగే కొద్దీ పని చేయదని, నలభై, యాభై ఏళ్ళలో మన మెదడు పనితీరు మరింత తగ్గిపోతుందని వారు వివరిస్తున్నారు. మెదడు చురుకుదనాన్ని కాపాడుకోవాలంటే దాన్ని మరింతగా ఉపయోగిస్తూ ఉండాలని, రోజూ కాకపోయినా అప్పుడప్పుడైనా మెదడుకు పని కల్పించాలని, క్రాస్‌వర్డ్ పజిల్, సుడోకు వంటి వాటితో కుస్తీ పట్టడం వల్ల మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామాలలో బ్రిస్క్ వాకింగ్ కూడా మెదడును చురుకుగా ఉంచుతుందట. ఇంకేం మరి.. రోజూ బ్రిస్క్ వాకింగ్ చేస్తే సరి!

నిపుణులు ఇలా అంటున్నారు...
కళ్లు మూసుకుని డ్రెస్ చేసుకోండి.

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కళ్లు మూసుకుని ఆ రోజు మీ కంచంలో వడ్డించి ఉన్న ఆహార పదార్థాలు ఏమిటన్నది.. వాసన, రుచి, చేతితో తడమడం ద్వారా గుర్తించండి.

కళ్లు, చెవులు, నోరు, ముక్కు తదితర జ్ఞానేంద్రియాలను ఒకే సమయంలో వేర్వేరు పనులకు ఉపయో గించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు.. చెవులతో మీ కిష్టమైన మ్యూజిక్ వింటూ, ముక్కుతో ఏదైనా పర్‌ఫ్యూమ్ వాసన చూస్తూ, కిటికీలోంచి బయటికి చూస్తూ కాసేపు కూర్చోండి.

ఒక పనిని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా మరో పద్ధతిలో చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఆరిన దుస్తులను రోజూలా కాకుండా వైవిధ్యంగా మడతబెట్టడానికి ప్రయత్నించండి.

కుడి చేత్తో చేసే పనులకు ఎప్పుడన్నా ఎడమ చెయ్యి ఉపయోగించండి.

వెరైటీగా ఇతర దేశాల వంటకాలను ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీ మెదడును ఆలోచింపజేసేవే. నిరంతరం ఆలోచిస్తూ, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మీ మెదడు తన చురుకుదనాన్ని అంత త్వరగా కోల్పోదని నిపుణులు సెలవిస్తున్నారు.
మరి ఆలస్యం ఎందుకు పాటించి చూదాం.. ఏమంటారు... :)


2 comments:

  1. These things are easily said than done. I appreciate the hard work being put into writing all these articles at one place as this will make life easy in a small way.............

    ReplyDelete
  2. నిజం ఎప్పుడూ నిష్ఠూరముగానే ఉంటుంది. మనము చెయ్యలేమని తప్పు అంటే ఎలాగ?

    ReplyDelete