Pages

Wednesday, October 13, 2010

ది ప్రిడేటర్స్ !!!

హలో మిత్రులారా !!! ఎలా వున్నారు ?
ఇదిగో ఈ ప్రాంతం చూడండి గుర్తు పట్టారా...   ఆఫ్రికా ఖండంలోని నైజీరియా ప్రాంతం....

              అక్కడి సామన్య నైజీరియన్లు తమ జీవితంలోని ఒడిదొడుకులను అధికమించటానికి టాక్సీ డ్రైవర్ల్ గాను, కొట్ల దగ్గర గుర్ఖాలగాను, సేల్స్ మెన్లగాను పని చేసుకుంటూ వుంటారు. వీళ్ళ మీద అక్కడి పోలిస్ ఫోర్స్ తమ ప్రతాపము చూపిస్తూ ఉన్నారు. ఎదో రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టి లేద భయ పెట్టి లంచాలు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వక పోతే మానవ హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టి భయ పెడుతున్నారు. ఇందులో సీనియర్ పోలిస్ ఆఫీసర్లకి కూడా హస్తం ఉంది. వాళ్ళకి వచ్చే మొత్తం వాళ్ళకి వస్తుంది. 
             
                     The Nigeria Police Force, 1930 లో స్ఠాపించబడి, లంచగొండితనంలోను, క్రిమినల్ కాండక్ట్ లోను, ప్రొఫెనలిజంలేని సర్వీస్ లో పేరు తెచ్చుకున్న సంస్ఠ. గత కొద్ది సంవత్సరాలుగా, ఆఫ్రికా లోని అతి పెద్ద పోలిస్ ఫోర్స్ల్ లో ఒకటిగా, ఏనాడూ ప్రజల లో రక్షన కల్పిస్తాము అని తన మీద నమ్మకం కలిగించలేక పోయింది. అది కాక పుట్టి 80 సంవత్సరాలు అయినా, ప్రజలు ఆ పోలిస్ వాళ్ళని ప్రిడేటర్స్ గా చుస్తున్నారు కాని ప్రొటెక్టర్స్  గా కాదు.      
      
               నైజీరియా ప్రభుత్వము దీనికి గల కారణాలని వెలికితీసి, దానికి గల దోషులని శిక్షించి మరియు నైజీరియ పోలిస్ ఫోర్స్ ని ప్రక్షాలన చెసి క్రమబధ్ధీకరించి, అవినీతి నిర్మూలన విభాగాన్ని స్థాపించి, అవినీతి కి పాల్పడ్డ ఉద్యోగులమీద కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. 
దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://www.hrw.org/en/node/92378/section/1

No comments:

Post a Comment