Pages

Sunday, October 3, 2010

ఆహ్లాదానికి నిలయం...శిల్పారామం !!!



        
ఈ వారాంతం చాలా సరదాగా గడిచిపోయింది. మా అమ్మ వచ్చింది ఇక్కడికి. ఈ ఆదివారం నేను, అమ్మ, అక్క మరియు బావ గారు కలిసి శిల్పారామం వెళ్ళాం. మర్చే పోయాను మా అక్క కూతురు కూడా ఉందండోయ్, దాని వయసు ఒక సంవత్సరం 9 నెలలు. మరి ఆ విశేషాలు మీతో పంచుకోవాలనే ఈ నా ప్రయత్నం...
             
         హస్తకళా మేళాతో శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఈ మేళాలో దేశంలోని 23 రాష్ట్రాలనుండి వ్యాపారులు తమ వస్తువులను ప్రదర్శిస్తున్నారు. ఎన్నో అపురూప, గృహోపకరణాలు, కొలువుదీరాయి. మహిళల మనసును దోచే గాజులు, మట్టి వస్తువులు, డ్రెస్సులు, ముత్యాల గొలుసులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చేనేత రంగంలో పేరుగాంచిన గద్వాల్‌, పోచంపల్లి, వెంకటగిరి చీరలు, టవల్స్‌, లుంగీలే, చేతి రుమాలు, చిన్న పిల్లల దుస్తువులు ఎన్నో ఉన్నాయి. రోజంతా తమ తమ విధుల్లో నిమగమైన వారు సాయంత్రం వేళల్లో కుటుంబ సమేతంగా శిల్పారామంను సందర్శిస్తున్నారు. తమకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటున్నారు. శని ఆది వారాల్లో సందర్శకుల సంఖ్య అధికం. దేశవ్యాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులు తరలి వచ్చి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం పనులతో మునిగే నగర ప్రజలకు శిల్పారామం చక్కటి ఆహ్లాదాన్ని అందిస్తోంది.
        అక్కడి లాన్ లో మా చిన్నరి గెంతులు ఇలా అలా కాదు, ఆప లేక,  మా పని అయిపోయింది  అనుకొండి. దాని అనందానికి అవధులు లేవు, అక్కడి పిల్లలతో ఆటలు, అబ్బో ఇంక అలా చెప్పుకుంటూ పోతే ఇంక అంతే సంగతులు, మరి మీరు కూడా అవకాశం దొరికినప్పుడు శిల్పారమం చూసి అనందించండి.

1 comment: